: పాతబస్తీలో పోలీసు ర్యాలీ
పాతబస్తీలో పోలీసులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పండుగ దినాల్లో ప్రజలంతా మత సామరస్యాన్ని పాటించాలని కోరుతూ ఈ ప్రదర్శన సాగింది. రంజాన్, బోనాల పండుగలు ఒకేసారి రావడంతో ప్రజలు కలసిమెలసి సోదర భావంతో పండుగలు చేసుకోవాలనే నినాదంతో ఈ ప్రదర్శన నిర్వహించారు. మాదన్నపేట నుంచి లాల్ దర్వాజా వరకు సాగిన ప్రదర్శనలో వందలాదిమంది పోలీసులు, అధికారులు పాల్గొన్నారు. ర్యాలీకి ఏసీపీ, డీసీపీలు సారథ్యం వహించారు.