: డబ్బింగు సీరియళ్ళ నిషేధానికి తెలుగు టీవీ కళాకారుల డిమాండ్
తెలుగు టీవీ చానెళ్ళలో ప్రసారం అవుతున్న డబ్బింగు సీరియళ్ళకు వ్యతిరేకంగా తెలుగు టీవీ సీరియళ్ళ నిర్మాతలు, కళాకారులు పోరాటం ప్రారంభించారు. డబ్బింగు సీరియళ్ళ వల్ల తమ మనుగడకే ముప్పు ఏర్పడిందని వారు వాపోతున్నారు. తెలుగు టీవీ చానెళ్ళన్నీ వీటిని నిషేధించాలంటూ ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు.
అందులో భాగంగా ఈ రోజు సీరియళ్ళ షూటింగులకు బంద్ పాటించమంటూ తెలుగు టీవీ కళాకారుల పరిరక్షణ జేఏసి పిలుపునిచ్చింది. ఇదిలా వుండగా, డబ్బింగు సీరియళ్ళ నిషేధానికి తెలుగు చానెళ్ళు అన్నీ ఒప్పుకున్నప్పటికీ, 'మాటీవీ' మాత్రం ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. మాటీవీ ప్రసారం చేస్తున్న డబ్బింగు సీరియళ్ళకు మంచి రేటింగు ఉండడంతో, ఈ విషయంలో వారు వెనుకంజ వేస్తున్నారట!