: లంచం ఆరోపణలతో ఎయిర్ ఫోర్స్ సీనియర్ అధికారిపై వేటు
లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ ఏకె ఠాకూర్ పై భారత వాయుసేన (ఐఏఎఫ్) వేటు వేసింది. 2011లో బెంగళూరులో నిర్వహించిన ఎయిర్ ఇండియా షోలో ఫ్రాన్స్ కు చెందిన 'డసాల్ట్ ఏవియేషన్' అధికారుల నుంచి రూ. 20వేలు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకుంది. ఫ్రెంచ్ ఫైటర్ జెట్ 'రఫేల్' ను ఎయిర్ షోలో ముందు వరుసలో నిలిపేందుకని డసాల్ట్ ఏవియేషన్ ఈ లంచం అందించింది. ఠాకూర్ పై అంతకుముందూ కొన్ని ఆరోపణలు రాగా, వాటిపైనా దర్యాప్తు చేపట్టడంతో అవినీతికి పాల్పడ్డట్లు తేలింది. దాంతో, 'జనరల్ కోర్ట్ మార్షల్' అతనిని దోషిగా తేల్చింది. ఆ వెంటనే ఆయనను సర్వీసు నుంచి ఐఏఎఫ్ తప్పించినట్లు సమాచారం.