: హుమా ఖురేషీ తో నాకు లింకేంటి?: షాహిద్ కపూర్
వర్ధమాన నటి హుమా ఖురేషితో తనకు ఎలాంటి సంబంధంలేదని ప్రముఖ బాలీవుడ్ యువ హీరో షాహిద్ కపూర్ వివరణ ఇచ్చాడు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన షాహిద్, తానెవరిని కలిస్తే వారితో సంబంధం అంటగట్టేస్తున్నారని వాపోయాడు. అసలీ వదంతులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియడం లేదని అన్నాడు. ఒంటరిగా ఉంటే ఇలాంటి సమస్యలే వస్తాయని బాధపడ్డాడు. ఇప్పటి వరకూ ఆమెను రెండుసార్లు కలిసానని చెప్పిన ఈ లవర్ బాయ్, పనితో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నానని చెప్పాడు. గతంలో ప్రియాంకతో ప్రేమాయణం నడిపినప్పుడూ మొదట్లో ఇలాంటి నంగనాచి తుంగబుర్ర కబుర్లే చెప్పాడని బాలీవుడ్ గుర్తు చేసుకుంటోంది. కాగా, హుమా ఖురేషి బాలీవుడ్ లో ప్రత్యేకించి 35 మంది నటులతో ఇంకెప్పుడూ నటించనని తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే.