: నామినేషన్లకు నోచుకోని పంచాయతీలు


పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని కొన్ని పంచాయతీలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం... 26 పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదని తెలిపారు. అటు 838 పంచాయతీలకు ఒక్కొక్క నామినేషనే వచ్చిందని చెప్పారు. ఇకపోతే నామినేషన్ల ఉపసంహరణకు రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు విధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. గడువు ముగిసిన అనంతరం బరిలో మిగిలిన సర్పంచ్, వార్డు అభ్యర్ధుల జాబితా ప్రకటిస్తామని, అభ్యర్ధులకు ఎన్నికల చిహ్నాలు కేటాయిస్తామని ఎన్నికల సంఘం కమిషనర్ నవీన్ మిట్టల్ చెప్పారు. పోలింగ్ కు 48 గంటల ముందు ఎలాంటి పాదయాత్రలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించకూడదన్నారు.

  • Loading...

More Telugu News