: ఏడాదిపాటు అనాథ బాలిక శరీరంతో ఆడుకున్నారు!


ఆమె ఓ అనాథ బాలిక. నా అన్నవాళ్ళెవరూ లేక, ఏ దిక్కూ కానరాక ఓ ఆశ్రమం పంచన చేరింది. కానీ, అక్కడ కాముక మృగాలు కాచుక్కూచున్నాయని గ్రహించలేని ఆ అభాగ్యురాలు చివరికి వాటికి బలైపోయింది. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ పట్టణంలో జరిగిందీ దారుణం. 'గురుకుల్ శాంతిధామ్' అనాథాశ్రమంలో 13 ఏళ్ళ బాలికపై అక్కడి ఉద్యోగులే ఏడాదిపాటు తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. శివకుమార్ (20), భైశాఖీ దాస్ (50), వరుణ్ (35) అనే ఆశ్రమ ఉద్యోగులు ఆ బాలికను బెదిరిస్తూ తమ పశువాంఛలను తీర్చుకునేవారు. ఓరోజు శివకుమార్ బాలికను మరోసారి బలాత్కరిస్తుండగా ఆమె పెద్దగా అరవడంతో మేనేజర్ స్పందించి విషయాన్ని పోలీసులకు తెలిపాడు. దీంతో వారు శివకుమార్, భైశాఖీలను అరెస్టు చేశారు. వరుణ్ పరారీలో ఉన్నాడు.

  • Loading...

More Telugu News