: డైరక్టర్ పదవీకాలం పెంచండి: సుప్రీంకు సీబీఐ నివేదిక
సీబీఐ డైరెక్టర్ పదవీకాలాన్ని రెండు సంవత్సరాల నుంచి మూడేళ్లకు పెంచాలని సుప్రీంకోర్టుకు సమర్పించిన తన నివేదికలో సీబీఐ కోరింది. స్వయం ప్రతిపత్తి విషయంలో కేంద్రం నిర్ణయంపై సీబీఐ ఈ నివేదిక తయారుచేసింది. సీబీఐ డైరెక్టర్ నేరుగా హోంశాఖను సంప్రదించే అధికారం కల్పించాలని కోరింది. సీబీఐ డైరెక్టర్ కు పరిపాలన, క్రమశిక్షణ, ఆర్ధిక పరమైన అధికారాలు తక్కువగా ఉన్నాయని, దాని ప్రభావం కేసుల దర్యాప్తుపై పడుతోందని తన నివేదికలో వివరించింది.