: విశాఖ సీటుపై మాటల యుద్ధం


విశాఖపట్నం లోక్ సభ సీటు మీద మళ్ళీ యుద్ధం మొదలైంది. కేంద్ర మంత్రి పురందేశ్వరి, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామి రెడ్డి మధ్య మాటల యుద్ధం స్పీడందుకుంది. వచ్చే ఎన్నికలలో కూడా తాను విశాఖ నుంచే పోటీ చేస్తానని చెబుతూ, పురందేశ్వరి నియోజక వర్గంలో సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ పోతున్నారు.

అయితే, ఈసారి ఇక్కడి నుంచి తాను పోటీ చేస్తున్నట్టు, ఇందుకు సంబంధించి సోనియా తనకు హామీ ఇచ్చినట్టు సుబ్బరామి రెడ్డి నిన్న తన రాగాన్ని హై పిచ్ లో అందుకున్నారు. ఆయన ఇంకొక అడుగు ముందుకేసి, పురందేశ్వరి నరసరావుపేట నుంచి పోటీ చేస్తారనీ, ఆమె అక్కడ పోటీ చేస్తే ఇంట్లో కూర్చున్నా నెగ్గడం ఖాయమనీ రెడ్డి ఏకంగా జోస్యమే చెప్పేశారు.

అలా పోటీ చేస్తే, తాను విశాఖ నుంచి నెగ్గడం ఖాయమనీ, అప్పుడు కాంగ్రెస్ కు రెండు సీట్లు సునాయాసంగా వస్తాయనీ ఆయన లెక్కలు కడుతూ చెబుతున్నారు. పురందేశ్వరి మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. మరి, వీరి పోరు ఎవరు తీరుస్తారో?  

  • Loading...

More Telugu News