: క్రైస్తవ సన్యాసినిపై వారం రోజుల పాటు అత్యాచారం


శిక్షణలో ఉన్న ఓ క్రైస్తవ సన్యాసినిపై ముగ్గురు యువకులు దారుణానికి ఒడిగట్టారు. వారంరోజుల పాటు ఆమెపై దారుణంగా అత్యాచారం జరిపారు. ఒడిశాలోని గజపతి జిల్లాలో ఈ కీచకపర్వం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. చెన్నైలోని సెయింట్ మేరీ కాన్వెంట్ లో ట్రైనీ నన్ గా వ్యవహరిస్తున్న బాధిత యువతికి కొద్దిరోజుల క్రితం కాంధమాల్ జిల్లాలోని ఆమె స్వగ్రామం మింజాపంక నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. తల్లి ఆరోగ్యం బాగాలేదన్నదే ఆ ఫోన్ కాల్ సారాంశం. తల్లిని పరామర్శించేందుకు ఆమె బెర్హాంపూర్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. అక్కడ ఆమె గ్రామానికే చెందిన ఇద్దరు సోదరులు జితేంద్ర, జోగీంద్ర ఆమెను తమతోపాటు తీసుకెళ్ళారు.

తనకు తెలిసినవాళ్ళే కావడంతో ఆమె వారి వెంట బయల్దేరింది. కానీ, వారు ఆమెను గజపతి జిల్లాలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్ళి వారం రోజుల పాటు అత్యాచారం జరిపారు. ఈ మానభంగ పర్వంలో వారితో మరో వ్యక్తి కూడా కలిశాడు. ఈ ముగ్గురూ కలిసి ఆ యువతికి ఏడురోజుల పాటు నరకం చూపి, అనంతరం బెర్హాంపూర్ రైల్వే స్టేషన్ వద్దే ఆమెను వదిలిపెట్టి పరారయ్యారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు సోదరులను అరెస్టు చేశారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News