: జగన్ కేసులో సీబీఐ ముందుకు బ్యాంకు అధికారులు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సీబీఐ ఎదుట పలు జాతీయ బ్యాంకుల అధికారులు హాజరయ్యారు. ఇదే కేసులో సీబీఐ ఎదుట ప్రైవేటు విద్యుత్ పవర్ ప్రాజెక్టు ప్రతినిధి రాఘవరావు కూడా హాజరయ్యారు. కాగా, నిన్నటి విచారణలో సీబీఐ కోర్టు జగన్ కు ఈనెల 29 వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. జగన్ కేసులో ఇప్పటికే మూడు చార్జిషీట్లపై దర్యాప్తు పూర్తి చేసిన సీబీఐ.. మిగిలిన రెండు చార్జిషీట్లపై దర్యాప్తు ముమ్మరం చేసింది.