: ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభం


రాష్ట్రంలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు నేడు పోలింగు జరుగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఉదయం 8 నుంచి సాయంకాలం 4 వరకు పోలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి (సిఈఓ) భన్వర్ లాల్ చెప్పారు.

సాయంత్రం నాలుగు వరకు వరుసలో వున్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని అన్నారు. మూడు పట్టభద్రులు, మూడు ఉపాధ్యాయ నియోజక వర్గాలకు జరిగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 83 మంది అభ్యర్ధులు రంగంలో వున్నారు.

  • Loading...

More Telugu News