: ముంబయిలో పెరిగిపోతున్న అబార్షన్లు


ముంబయి మహానగరంలో ఏటా అబార్షన్ల సంఖ్య పెరిగిపోతోందని అక్కడి వైద్య ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. గడిచిన మూడేళ్ళకాలంలో 61 శాతం పెరుగుదల నమోదయిందని వెల్లడించింది. 2011-12లో ఈ మహానగరంలో 16,977 అబార్షన్లు నమోదు కాగా, 2012-13లో 27,256 అబార్షన్లు ఆరోగ్య శాఖ రికార్డులకెక్కాయి. వీటిలో ప్రైవేటు ఆసుపత్రుల్లో నమోదైన గర్భస్రావాలే ఎక్కువగా ఉన్నాయట. అయితే, అబార్షన్ల విషయంలో తామేమీ చేయలేమని వైద్య, ఆరోగ్యశాఖ చేతులెత్తోస్తోంది. అవాంఛిత గర్భం ధరించిన వాళ్ళు, స్కానింగ్ లో బయటపడిన ఆడశిశువులను వదిలించుకోవాలని భావించే వాళ్ళు.. గర్భస్రావాల శాతం పెరిగేందుకు కారణమవుతున్నారని వారు అధికారులు వివరించారు.

  • Loading...

More Telugu News