: అత్యధిక విద్యుత్ ఛార్జీలు చెల్లించేది మనమే


మీకో విషయం తెలుసా.... దేశంలో అత్యధిక విద్యుత్ ఛార్జీలు మనమే చెల్లిస్తున్నామండోయ్. ఈ విషయాన్ని సాక్షాత్తూ ఈఆర్సీ తాత్కాలిక చైర్మన్ శేఖర్ రెడ్డి తెలిపారు. ఆడిటర్లతో జమా ఖర్చులు చూపమంటే తమకు ఆర్ధిక భారమవుతుందన్న డిస్కంల వాదనపై హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, దేశంలోనే అత్యధిక విద్యుత్ ఛార్జీలు రాష్ట్రంలోనే ఉన్నాయన్నారు. విద్యుత్ సంస్థల ఖర్చులు పరిశీలించే ఆడిటర్ల నియామకం వినియోగదారుల ప్రయోజనం కోసమనడం సరికాదని, డిస్కంల లెక్కలన్నీ చూపించి ఛార్జీలు పెంచడం కుదరదని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణం చూపించి ఛార్జీలు పెంచాలని విన్నపాలు చేయడం సరికాదని డిస్కంలకు హితవు పలికారు.

  • Loading...

More Telugu News