: తెలంగాణ ఏర్పడితే ప్రజల పరిస్థితి దుర్భరమే : జగ్గారెడ్డి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంటుందని ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన అంటూ జరిగితే తెలంగాణను మత రాజకీయాలు శాసిస్తాయని, విడిపోతే తెలంగాణ ప్రాంతం అల్లకల్లోలం అవుతుందని ఓ వార్తా చానల్ తో మాట్లాడిన సమయంలో ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఈనెల 12వ తేదీన ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో సమర్పించిన నివేదికలో మావోయిస్టుల అంశాన్ని ముఖ్యమంత్రి కిరణ్ ప్రస్తావించడాన్ని జగ్గారెడ్డి ఈ సందర్భంగా సమర్ధించారు. సీఎం హోదాలోనే ఆయన ఈ అంశాన్ని లేనెత్తారని, కిరణ్ ప్రతిపాదించిన ప్యాకేజీ తెలంగాణకు వరమని పేర్కొన్నారు. తెలంగాణ వెనుకబడి ఉందని, ఉద్యమాలు చేస్తున్న వారు ఈ ప్యాకేజీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.