: గుజరాత్ సీఎం విలువ రూ.5: మనీష్ తివారీ
మోడీ బహిరంగ సభ ప్రవేశానికి 5 రూపాయలు చార్జీగా వసూలు చేయాలన్న బీజేపీ నిర్ణయంపై కాంగ్రెస్ నేత మనీష్ తివారీ విమర్శనాస్త్రాలు సంధించారు. సభలో ప్రవేశానికి టిక్కెట్ పెట్టడం గుజరాత్ ముఖ్యమంత్రి అసలైన విలువను తెలియజేస్తోందంటూ తివారీ ట్విట్టర్ లో వ్యంగంగా పోస్ట్ చేశారు. 'బాబా ప్రవచనానికి చార్జీ 100 రూపాయల నుంచి లక్ష రూపాయలు. అదే బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టిన సినిమాకైనా టికెట్ చార్జీ 200 నుంచి 500 రూపాయల వరకు ఉంది. సీఎం సభకు టికెట్ చార్జీ మాత్రం 5 రూపాయలు' అంటూ ఎద్దేవా చేశారు.