: కారులో రూ.10 లక్షలు పట్టివేత
కృష్ణా జిల్లా తిరువూరు సమీపంలోని ముత్తగూడెం చెక్ పోస్టు వద్ద ఓ కారులో రూ.10 లక్షలు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదయం సీఐ ప్రసాదరావు, ఎస్ఐ బి.వెంకటేశ్వరరావు తమ సిబ్బందితో పలు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ కారులో ఈ డబ్బును గుర్తించారు. ఖమ్మం జిల్లా నుంచి వస్తున్న కారును అనుమానంతో తనిఖీ చేయడంతో నగదు బయటపడిందని తెలిపారు. నగదుకు సంబంధించి వివరాలు తెలపకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.