: దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె ప్రభావం
కార్మిక సంఘాలు చేపట్టిన 48 గంటల సార్వత్రిక సమ్మె ప్రభావం దేశవ్యాప్తంగా కనిపించింది. తొలిరోజు రవాణా, బ్యాంకింగ్, విద్యా సంస్థలు, పారిశ్రామిక రంగాలు సమ్మెతో స్థంభించాయి. నోయిడాలో కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
పలు కార్లు, ద్విచక్ర వాహనాలను ఆందోళనకారులు తగులబెట్టారు. ఈ దాడులకు పాల్పడ్డ 14 మంది ఆందోళనకారులను నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాలులో బంద్ ప్రభావం పాక్షికంగా ఉంది. రైల్వే వ్యవస్థ స్థంభించగా, పలు విద్యా, ప్రభుత్వ రంగ సంస్థలు పాక్షికంగా నిర్వహించారు.

అయితే, కార్మిక సంఘాల డిమాండ్లు ఒక్క రోజులో తీర్చేవి కావని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మల్లిఖార్జున్ ఖర్జ్ అన్నారు. అందుకు కొంత సమయం పడుతుందని ఆయన అన్నారు. మరోవైపు దేశ జీడీపీపై సమ్మె ప్రభావం చూపుతుందని, 15 నుంచి 20 వేల కోట్లు దేశ ఆర్థిక వ్యవస్థ నష్టపోయిందని అసోచాం తెలిపింది. రేపు కూడా సమ్మె కొనసాగితే ఈ నష్టం 25 నుంచి 26 వేల కోట్లు దాటవచ్చని అసోచాం అధికారి చెప్పారు.