: రామోజీ ఫిల్మ్ సిటీలో సల్మాన్ ఖాన్ కు గాయాలు
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ప్రమాదవశాత్తూ గాయపడినట్లు సమాచారం. సల్మాన్ నటిస్తున్న 'మెంటల్' చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇందులో గోడదూకే సన్నివేశంలో అతడి కాలికి స్వల్ప గాయం కాగా, ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది.