: కేకులు తింటే కేన్సరొస్తుంది


ఆకలి వేస్తుంటే ఇంట్లో ఉండే బిస్కెట్లు, లేదా చాక్లెట్లు ఇలా ఏది దొరికితే అది లాగించేస్తుంటాం. దీనికితోడు ఆకలిగా ఉంటే 'ఇది తీసుకో' అంటూ చాక్లెట్‌ తినమంటూ ప్రకటనలు కూడా వస్తున్నాయి. అయితే ఇలా కేకులు, డ్రింకులు, క్రిస్పీలు వంటివి అమితంగా తింటే కేన్సర్‌ వచ్చే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

అబెర్‌దీన్‌, ఎడిన్‌బరో విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో భాగంగా రెండువేల మంది పేగు కేన్సర్‌ బాధితుల ఆహార అలవాట్లను పరిశీలించారు. తమ పరిశీలనలో బాగా తియ్యగా ఉండే ఆహారపదార్ధాలను ఎక్కువగా తీసుకున్న వారికి పేగు కేన్సర్‌ వచ్చే ప్రమాదముందని తేలినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. కేకులు, డ్రింకులు, క్రిస్పీలు, డెజర్ట్‌లు, బిస్కెట్లు వంటి తీపి ఆహార పదార్థాలను మితిమీరి తినడం వల్ల పేగు కేన్సర్‌ వచ్చే ప్రమాదం పొంచి ఉన్నట్టు తమ అధ్యయనంలో వెల్లడైనట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.

  • Loading...

More Telugu News