: మూడు రోజుల్లో 32 కోట్లు... ఫ్లయింగ్ సిఖ్ సినిమా 'భాగ్ మిల్కా భాగ్'
భారత ప్రముఖ అథ్లెట్, ఫ్లయింగ్ సిఖ్ గా పేరుపొందిన మిల్కాసింగ్ జీవిత చరిత్ర నేపథ్యంతో తీసిన 'భాగ్ మిల్కా భాగ్' సినిమా రికార్డుల దిశగా ప్రదర్శితమవుతోంది. శుక్రవారం రిలీజైన ఈ సినిమా, ఆదివారం నాటికి 32 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించింది. అంటే మూడు రోజుల్లోనే 32 కోట్లను వసూలు చేసింది. ఉత్తరాదిలోనే కాకుండా దక్షిణాదిలో కూడా మంచి ఆదరణ పొందుతోందని బాలీవుడ్ వాణిజ్య వర్గాలంటున్నాయి. మరో వైపు ఈ సినిమాకు క్రీడాకారుల ప్రశంసలు అందుతున్నాయి. కేరళలో ప్రముఖ అథ్లెట్ పీటీ ఉష ఈ సినిమాను వీక్షించారు. క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన మిల్కా సింగ్ ఆ స్థాయికి చేరుకునేందుకు పడ్డ శ్రమ అంతా ఇంతా కాదని పీటీ ఉష పేర్కొన్నారు.