: పుట్టపర్తి వివాదాలమయం


సత్యసాయి అస్తమయం తరువాత ఆధిపత్యపోరుతో ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి వివాదాలమయమైపోయింది. ఆస్తుల పంపకాలు, ఆధ్యాత్మిక కేంద్రంపై ఆధిపత్యం కోసం సత్యసాయి తమ్ముడి కొడుకు రత్నాకర్, సత్యసాయి మేనల్లుడు గణపతిరాజు మధ్య నిప్పు రాజుకుంటోంది. ఈ క్రమంలో చేతికి అందిన ఏ అవకాశాన్ని వీరు వదలడంలేదు. తాజాగా గణపతిరాజుపై అట్రాసిటీ కేసు నమోదైంది. రత్నాకర్ అనుచరుడు చింతమాను సాయిప్రసాద్.. గణపతిరాజు తనను దూషిస్తూ దాడి చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రతిగా, సాయిప్రసాద్ తనపై హత్యాయత్నం చేశాడంటూ గణపతిరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరోవైపు గణపతిరాజుకు వ్యతిరేకంగా పుట్టపర్తిలో ఆందోళనలు ఊపందుకుంటున్నాయి. రత్నాకర్ పై గణపతిరాజు రోజుకో ఆరోపణతో రచ్చకెక్కుతుండడంతో పుట్టపర్తి పరువు మంటగలుస్తోందంటూ, భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ పలువురు స్థానికులు మండిపడుతున్నారు.

  • Loading...

More Telugu News