: జైపాల్ రెడ్డితో దిగ్విజయ్ భేటీ


కేంద్రమంత్రి జైపాల్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ ఈ సాయంత్రం ఢిల్లీలో భేటీ అయ్యారు. జైపాల్ రెడ్డి నివాసంలో దాదాపు 40 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. ప్రధానంగా తెలంగాణ అంశంపైనే వీరిద్దరి మధ్య మంతనాలు సాగినట్టు సమాచారం. ఇటీవలే ముగిసిన కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలో తెలంగాణపై ఏమీ తేలని నేపథ్యంలో వీరిద్దరి సమాలోచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

  • Loading...

More Telugu News