: ఇంగ్లండ్ ను ఈసారి కుమ్మేస్తాం: క్లార్క్ ధీమా


యాషెస్ సిరీస్ రెండో టెస్టులో పుంజుకుంటామని ఆస్ట్రేలియా జట్టు సారథి మైకేల్ క్లార్క్ తెలిపాడు. ట్రెంట్ బ్రిడ్జ్ టెస్టులో 14 పరుగుల స్వల్ప తేడాతో పరాజయంపాలవడం పట్ల క్లార్క్ స్పందించాడు. లార్డ్స్ మైదానం వద్ద నేడు మీడియాతో మాట్లాడుతూ.. డీఆర్ఎస్ విధానంతో తొలి టెస్టులో తాము చాలా నష్టపోయామని వివరించాడు. తమకు వ్యతిరేకంగా చాలా నిర్ణయాలు వెలువడ్డాయని, అవి ఓటమికి దారితీశాయని అభిప్రాయపడ్డాడు. ఇక తమ ఆటగాళ్ళు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారని చెప్పాడు. విజయమే లక్ష్యంగా లార్డ్స్ టెస్టులో బరిలో దిగుతామని క్లార్క్ వెల్లడించాడు. ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ లో రెండో టెస్టు ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో గురువారం ఆరంభం కానుంది.

  • Loading...

More Telugu News