: తెలంగాణపై ఇప్పుడే ఎలా చెబుతాం? : అజహరుద్దీన్
తెలంగాణ అంశంపై మాజీ క్రికెటర్, ఎంపీ అజహరుద్దీన్ ఆచితూచి స్పందించారు. తెలంగాణపై కేంద్రం ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడిస్తుందో చెప్పలేమని అజహర్ అన్నారు. దీనికి సంబంధించి తీసుకునే నిర్ణయాన్ని ముందే ఊహించి చెప్పడం చాలా కష్టమని ఢిల్లీలో విలేకరులతో చెప్పారు. అయితే, తాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావడంపై ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని, ఇప్పుడే ఏమి చెప్పలేనని అన్నారు.