: సైన్యంలో చేరతానని వెళ్లి తిరిగిరాని కొడుకు.. పదమూడేళ్లుగా అన్వేషిస్తున్న తల్లి


సైన్యంలో చేరతానని 2001 లో ఇల్లు వీడి వెళ్లిన తన కుమారుడిపై ఆశ వదులుకోని ఆ తల్లి 13 ఏళ్లుగా వెతుకుతూనే ఉంది. పేగు బంధం తీపితో ఇన్నేళ్లుగా తన కుమారుడు వస్తాడని ఆశగా ఎదురుచూసిన ఆ తల్లి వేదన వర్ణనాతీతం. శరవణన్ అనే తన కుమారుడు 'సైన్యంలో ఉద్యోగం వచ్చిందని, చెన్నై వెళ్లి, అధికారులు ఎక్కడ ఉద్యోగానికి వెళ్లమంటే అక్కడికి వెళ్తా'నని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడని, ఆ తరువాత అతని జాడలేదని తమిళనాడులోని రామేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతని వివరాలు తీసుకున్న పోలీసులు సైన్యంలో ఉన్నాడా? లేక ఇంకెక్కడైనా ఉన్నాడా? అని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News