: కర్నూలు జిల్లాలో సీన్ రివర్స్.. పోలీసోళ్ళకు చుక్కలు చూపించారు!


ఎక్కడైనా పోలీసులు లాఠీచార్జి చేస్తే ప్రజలు తలోదిక్కుకు పరిగెత్తడం చూస్తుంటాం. కానీ, కర్నూలు జిల్లాలో సీన్ రివర్సైంది. గ్రామస్తులు దాడి చేయడంతో బిక్కచచ్చిన పోలీసులు కాలికి బుద్ధిచెప్పారు. వివరాల్లోకెళితే.. జిల్లాలోని కొత్తపల్లి మండలం లింగాపురం గ్రామంలో బెల్టు షాపు నిర్వహిస్తున్నాడంటూ రమేశ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విడిపించుకునేందుకు వెళ్ళిన కుటుంబ సభ్యులకు పోలీసులు తమదైన శైలిలో మర్యాదలు చేసి వారినీ నిర్బంధించారు. దీంతో, ఆగ్రహోదగ్రులైన గ్రామస్తులు దాదాపు 70 మంది వరకు పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. దొరికిన పోలీస్ ను దొరికినట్టు చితకబాదారు. వారుకొట్టే దెబ్బలకు తాళలేని పోలీసులు పరుగులంకించుకున్నారు.

కోపం చల్లారని లింగాపురం గ్రామస్తులు ఎస్సై, కానిస్టేబుళ్ళ ఇంటిపైనా దాడులు చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఎస్సై జీపుతో పాటు పోలీసు వాహనాలను తమ క్రోధాగ్నికి బలిచేశారు. అనంతరం తమ వారిని విడిపించుకుని వెళ్ళారు. ఈ ఘటనపై సీరియస్ అయిన కర్నూలు జిల్లా ఎస్సీ రఘురాం రెడ్డి విచారణకు ఆదేశించారు. కాగా, గ్రామస్తులు తాగి వచ్చి తమపై దాడి చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News