: మోడీకి తెలిసింది ఉపన్యాసాలు దంచడమే: మాకెన్
కేంద్ర మాజీ మంత్రి అజయ్ మాకెన్ నేడు గుజరాత్ సీఎం నరేంద్ర మోడీపై ధ్వజమెత్తారు. ఉపన్యాసాలు దంచడం కాదని, స్వంత రాష్ట్రం గుజరాత్ ను అభివృద్ధి చేసుకోవాలని హితవు పలికారు. గతంలో క్రీడాశాఖ మంత్రిగా వ్యవహరించిన మాకెన్ నేడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, గుజరాత్ లో క్రీడలను పెద్దగా ప్రోత్సహించడంలేదని మోడీపై ఆరోపణలు చేశారు. అక్షరాస్యత విషయంలోనూ గుజరాత్ ది వెనుకబాటే అని విమర్శించారు. అంతేగాకుండా, లౌకికవాదంతోనే ఐకమత్యం సాధ్యమవుతుందని, మతతత్వం వల్ల ప్రజలమధ్య వైరుధ్యాలు ఏర్పడతాయని మాకెన్ అన్నారు. మోడీ.. ఇకనైనా కాంగ్రెస్ పై విమర్శలు మాని, గుజరాత్ పై దృష్టిపెట్టాలని సూచించారు.