: నడిరోడ్డుపై, పట్ట పగలు అందరూ చూస్తుండగా మహిళ హత్య
బీహార్ లో మానవీయ విలువలు అడుగంటిపోతున్నాయి. అక్కడి మనుషుల ప్రవర్తన చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. తాజాగా, సభ్యసమాజం భయపడే రీతిలో ఓ సంఘటన పాట్నాలో జరిగింది. వివరాల్లోకెళితే.. పాట్నాలోని పోస్టల్ పార్క్ ప్రాంతంలో పట్టపగలు ప్రాణభయంతో నడిరోడ్డు మీద పరిగెడుతున్న శకుంతలాదేవి అనే మధ్యవయస్సు మహిళను, దుండగులు వెంబడించి దొరకబుచ్చుకుని పదునైన ఆయుధాలతో నరికి చంపారు. పాతకక్షల వల్లే ఆమెను అలా చంపారని, నిందితుల కోసం గాలిస్తున్నామని పాట్నా సీనియర్ సూపరిండెంట్ మను మహరాజ్ తెలిపారు.