: విండీస్ ను 'ఏడు'పించిన అఫ్రిది


విండీస్ తో తొలి వన్డేలో డాషింగ్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది చెలరేగడంతో పాకిస్తాన్ భారీ విజయం సాధించింది. అఫ్రిది (76 పరుగులు, 7 వికెట్లు) ఆల్ రౌండ్ షో ధాటికి విండీస్ విలవిల్లాడింది. టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. కరీబియన్ బౌలర్లపై విరుచుకుపడిన అఫ్రిది కేవలం 55 బంతుల్లోనే 76 పరుగులు చేయడంతో పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 224 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ ను అఫ్రిది తన స్పిన్ మాయాజాలంతో కోలుకోలేని దెబ్బతీశాడు. దీంతో కేవలం 98 పరుగులకే విండీస్ కుప్పకూలింది.

9 ఓవర్లు బౌలింగ్ చేసిన అఫ్రిది కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో ఇవే అతని అత్యుత్తమ గణాంకాలు కాగా, పాక్ తరపునా అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనగా రికార్డులకెక్కింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అఫ్రిదికి దక్కగా, 5 వన్డేల సిరీస్ లో పాకిస్తాన్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

  • Loading...

More Telugu News