: పోలీసు కానిస్టేబుళ్ల నియామకాల దరఖాస్తుల స్వీకరణ పొడిగింపు
రాష్ట్రంలో 6,073 పోలీసు కానిస్టేబుళ్ల పోస్టుల నియామకాలకు దరఖాస్తుల స్వీకరణకు తుదిగడువును పెంచుతూ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక సంస్థ నిర్ణయం తీసుకుంది. దీంతో పోలీసు కానిస్టేబుళ్ల నియామకాల దరఖాస్తుల ప్రక్రియ తుదిగడువును ఫిబ్రవరి 28 వరకు పొడిగించినట్లు సంస్థ ప్రకటించింది.