: నలుగురు బాలికలపై 20 మంది అత్యాచారం


బాలికలపై లైంగిక దాడులు నానాటికీ ఎక్కువవుతున్నాయి. ఒకే గ్రామానికి చెందిన నలుగురు బాలికలు కామాంధుల చేతిలో నలిగిపోయారు. జార్ఖండ్ రాష్ట్రంలోని పకూర్ జిల్లా, లితిపరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో గతరాత్రి 20 మంది ఈ దారుణానికి ఒడిగట్టారు. నలుగురు బాలికలపై సామూహికంగా అత్యాచారం చేసి పరారయ్యారు. జిల్లా ఎస్పీ వైఎస్ రమేశ్ సదరు గ్రామాన్ని సందర్శించి వివరాలను సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు సహకరించాలని గ్రామస్థులను కోరారు.

  • Loading...

More Telugu News