: దేవుడి ఉనికిని కనుగొన్నా: వాణిశ్రీ
ఆమె ఒకప్పుడు నవలా నాయికగా తెలుగు చిత్రసీమలో వినుతికెక్కింది. జూనియర్ ఆర్టిస్టుగా కెరీర్ ఆరంభించి హీరోయిన్ గా ఎదిగిన ఆమె మరెవరో కాదు.. అభినేత్రి వాణిశ్రీ. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి స్డూడియోలో 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఆధ్యాత్మిక విషయాలపై తన అభిప్రాయాలు వెల్లడించింది. తాను తామరాకు మీది నీటిబొట్టులాంటి దాన్నని చెప్పింది. ప్రస్తుతం తాను దేవుడి ఉనికిని కనిపెట్టే దిశగా ప్రయత్నాలు చేసి, విజయవంతం అయ్యానని ఓ ప్రశ్నకు బదులిచ్చింది. దేవుడు ఎక్కడో ఉండడని చెబుతూ, ఒకరి నోటి దగ్గర అన్నం తీయకుండా ఉంటే మనమే దేవుడని చెప్పుకొచ్చింది. ఆధ్యాత్మికం వైపు ప్రయాణిస్తున్న తాను కుంకుమ పూజలు చేయనని, కొబ్బరి కాయలు కొట్టనని వెల్లడించింది. కనీసం తాను ప్రసాదాలు కూడా పెట్టనని తెలిపిందీ అలనాటి హిట్ చిత్రాల హీరోయిన్.