: వందేళ్ల సినిమా వేడుకలకు అమితాబ్, షారూఖ్ !


భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని చెన్నై వేదికగా ఉత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1,2,3 తేదీల్లో జరిగే ఈ వేడుకలకు బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ హాజరవనున్నారని తెలుస్తోంది. వీరేకాక పలువురు సినీ ప్రముఖులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని దక్షిణ భారతదేశ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సి. కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఈ వేడుకలకు బిగ్ బి, షారూఖ్ లు వస్తారని భావిస్తున్నామని చెప్పారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమంలో నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటారని చెప్పారు.

మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో... మొదటిరోజు తమిళ, మలయాళంకు సంబంధించిన కార్యక్రమాలు, రెండవరోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయని కల్యాణ్ వివరించారు. చివరి రోజు ఈ నాలుగు చిత్ర పరిశ్రమలు కలిసి ప్రదర్శనలు ఇస్తాయని అన్నారు. ఇదే వేదికపై 18 భాషల చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులను సన్మానిస్తామని, పరిశ్రమ ప్రముఖుల ముఖచిత్రాలతో పోస్టల్ స్టాంపులను విడుదల చేస్తామని చెప్పారు. కాగా, ఈ వేడుకల ప్రత్యేక గీతాన్ని చేయమని సంగీత దర్శకులు ఇళయరాజా, ఏఆర్ రెహ్మాన్ లను కోరామని.. అయితే వారి నుంచి స్పష్టత రాలేదనీ అన్నారు.

  • Loading...

More Telugu News