: ఎలక్షన్ కమిషన్ కు హైకోర్టు ఆదేశం


కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గ ఉపఎన్నిక నిర్వహణపై నివేదిక ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ను హైకోర్టు ఆదేశించింది. ఇక్కడి ఉప ఎన్నిక నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వారంలోగా తెలపాలని కోర్టు ఈసీకి సూచించింది. కొన్ని రోజుల కిందట ఈ పిటిషన్ ను అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన జి.రామాంజనేయులు, శ్రీనివాసులు అనే రైతులు దాఖలు చేశారు.

ఈ ఏడాది ఏప్రిల్ 21న అవనిగడ్డ శాసనసభ్యుడు అంబటి బ్రాహ్మణయ్య చనిపోయినప్పటి నుంచి ఉప ఎన్నిక నిర్వహించలేదని, అప్పటినుంచి అభివృద్ధి ఆగిపోయిందని, నియోజకవర్గాన్ని పట్టించుకునే నాథుడే లేడని వివరించారు. కాబట్టి, ఉప ఎన్నిక నిర్వహించేలా ఎన్నికల కమిషన్ ను ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. దాంతో, ఈ పిటిషన్ పై ఈ రోజు విచారణ చేపట్టిన కోర్టు ఈసీ అధికారులకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News