: కూలిన మిగ్... పైలట్ ప్రాణాలు అనంతవాయువుల్లోకి
మిగ్ విమానాలు మరోసారి అప్రదిష్ఠను మూటగట్టుకున్నాయి. ఈ తరహా ఫైటర్ జెట్ విమానాలు ఎప్పుడు, ఎక్కడ కూలిపోతాయో అనే వ్యంగ్యోక్తులను నిజం చేస్తూ.. మరో మిగ్ విమానం నేలకూలింది. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉత్తర్లాయ్ వద్ద మిగ్-21 యుద్ధవిమానం కూలిన దుర్ఘటనలో పైలట్ మృతి చెందాడు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు శకలాల తొలగింపు చర్యలు చేపట్టారు.