: మంత్రి గ్రామంలో దొంగలు పడ్డారు


మంత్రి కాసు కృష్ణారెడ్డి స్వగ్రామం గుంటూరు జిల్లా తూబాడులో దొంగలు పడ్డారు. గత అర్ధరాత్రి పంచాయతీ కార్యాలయం తాళాలు పగులగొట్టి కార్యాలయంలోకి ప్రవేశించిన దొంగలు, కీలక పత్రాలు తస్కరించారు. వాటితో పాటు అభ్యర్థి నామినేషన్ పత్రాలను కూడా దొంగిలించేందుకు దుండగులు తీవ్ర ప్రయత్నం చేశారు. అయితే వాటిని సురక్షిత ప్రదేశంలో ఉంచడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ఘటనపై పోలీసులకు గ్రామపంచాయతీ అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ పని చేసిందెవరు? పంచాయతీ పత్రాలతో వారికేం పని? అంటూ గ్రామస్థులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

  • Loading...

More Telugu News