: మండేలా త్వరలోనే డిశ్చార్జి అవుతారు: థాబో ఎంబెకి
ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ తో ఆసుపత్రి పాలైన నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా త్వరలోనే డిశ్చార్జి అవుతారని దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు థాబో ఎంబెకి ఆశాభావం వ్యక్తం చేశారు. మండేలా తప్పకుండా కోలుకుంటారని ఎంబెకి అన్నారు. నేడు జోహాన్నెస్ బర్గ్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంబెకి మీడియాతో మాట్లాడుతూ మండేలా ఆరోగ్యంపై స్పందించారు. దక్షిణాఫ్రికాలో జాతివివక్షకు వ్యతిరేకంగా దశాబ్దాల పాటు పోరాడిన మండేలా.. నెలరోజుల నుంచి ఆసుపత్రికే పరిమితమైన సంగతి తెలిసిందే.