: అమెరికాపై ఉత్తర కొరియా కొత్తరకం ప్రచారం
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, అమెరికా సైన్యం కలిసి ఎర్రటి మంటల్లో కాలిపోతున్నారు... కంగారు పడ్డారా? ఉత్తర కొరియా విడుదల చేసిన ఓ ప్రచార వీడియోలో ఈ దృశ్యం కనిపిస్తోంది. ఇది అమెరికా పట్ల ఉత్తర కొరియాకున్న విరోధాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. తాజాగా యూట్యూబ్ లో పోస్ట్ అయిన ఈ వీడియో పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.
అలాగే, గత ఆదివారం ఉంచిన మరో వీడియోలో, ఒబామా హెలికాప్టర్ వద్దకు నడుచుకుంటూ వెళ్తుండడం... అదే సమయంలో మరో వ్యక్తితో కరచాలనం చేస్తున్నప్పుడు... ఆయన ఇమేజ్ జ్వలించే మంటల్లో కాలిపోతున్నట్లు కనిపించింది. కంప్యూటర్ గ్రాఫిక్స్ సాయంతో ఇలాంటి అవాస్తవ వీడియో చిత్రాలను రూపొందించి ప్రచారం చేస్తూ, అమెరికా పట్ల తన ద్వేషభావాన్ని ఉత్తర కొరియా ఇలా వ్యక్తం చేస్తోంది!