: ఇండో-పాక్ సిరీస్ తో యాషెస్ ను పోల్చలేం: అక్రమ్


భారత, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లతో యాషెస్ ను పోల్చలేమని పాక్ స్వింగ్ సుల్తాన్ వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే యాషెస్ లోనూ పోటీతత్వం మెండుగా కనిపించినా.. భారత్, పాక్ మ్యాచ్ ల్లో నెలకొనే తీవ్రతతో పోల్చితే అది తక్కువే అని పేర్కొన్నాడు. కరాచీలో మీడియాతో ముచ్చటిస్తూ.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు ఓ మ్యాచ్ లో ఓడిపోతే 'బెటర్ లక్ నెక్స్ట్ టైమ్' అని సర్ది చెప్పుకుంటాయని.. అదే, పాకిస్తాన్ జట్టు భారత్ తో మ్యాచ్ ఓడిపోయిందంటే.. స్వదేశానికి ఇప్పుడప్పుడే రావద్దని సెలక్టర్లే చెబుతారని అక్రమ్ వెల్లడించాడు. 1996 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో తాము భారత్ చేతిలో ఓడామని, అప్పుడు సెలక్టర్లు ఈ మాటే చెప్పారని ఈ పేస్ లెజెండ్ గుర్తు చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News