: 'భాగ్ మిల్కా భాగ్' తొలి రోజు కలెక్షన్ 8.5కోట్లు


'ఫ్లయింగ్ సిఖ్' మిల్కా సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన 'భాగ్ మిల్కా భాగ్' చిత్రం మొదటి రోజు కలెక్షన్లు అదిరిపోయాయి. ఈ చిత్రం శుక్రవారం 1500 ధియేటర్లలో విడుదల కాగా, మొదటి రోజే ఏకంగా 8.5కోట్ల రూపాయల ఆదాయం వచ్చి పడింది. పరుగుల వీరుడు మిల్కా సింగ్ పాత్రను ఫర్హాన్ అక్తర్ పోషించారు. ఈ సినిమా కోసం ఫర్హాన్ తన శరీరాన్ని ఉక్కుముక్కలా మలుచుకున్నాడు. అందుకు 18 నెలలు పట్టిందట.

  • Loading...

More Telugu News