: మోడీ.. నీ వ్యాఖ్యలు వెనక్కితీసుకో: చంద్రబాబు డిమాండ్


గుజరాత్ సీఎం నరేంద్ర మోడీని 'కుక్క పిల్ల' కష్టాలు వీడేట్టు కనిపించడంలేదు. తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.. మోడీపై మండిపడ్డారు. గోధ్రా అల్లర్లలో మరణించిన ముస్లింలను కుక్కలతో పోల్చడాన్ని గర్హిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ.. వందలాది ముస్లింలు ప్రాణాలు కోల్పోతే కారుకింద పడ్డ కుక్క పిల్లలతో పోలిక పెట్టడం సరికాదన్నారు. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని బాబు డిమాండ్ చేశారు. ఇంత జరిగినా మోడీ పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోవడం దారుణమన్నారు. ఆనాటి మారణకాండను తేలికచేసి చూపడం అరాచకవాదులకు మరింత బలం చేకూర్చడమే అని బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News