: నామినేషన్ల పర్వంలో డిష్యుం డిష్యుం!
పంచాయతీ నామినేషన్ల సందర్భంగా పలు గ్రామాల్లో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఫైటింగులు సినిమాలను తలపిస్తున్నాయి. సర్పంచి పదవికి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ పత్రాలు చింపేశారంటూ.. చిత్తూరు జిల్లా మదనపల్లిలో కాంగ్రెస్, వైఎస్సార్సీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాల నాయకులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం ఇరుపార్టీల నాయకులు పంచాయతీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.