: తాజ్ మహల్ కు అండర్ గ్రౌండ్ పార్కింగ్


తాజ్ మహల్ సందర్శించేందుకు వచ్చే పర్యాటకులకు పార్కింగ్ కష్టాలు తీరనున్నాయి. అన్నీ కుదిరితే మరికొన్ని నెలల్లోనే అందమైన పూదోటతో పాటు, రెండంతస్థుల పార్కింగ్ కూడా సిద్దమవుతుంది. తాజ్ తూర్పు ద్వారం వద్ద రెండంతస్థుల పార్కింగ్, దానిపై ఓ ఉద్యానవనం ఏర్పాటు చేసేందుకు ఆగ్రా అభివృద్ధి సంస్థ సన్నాహాలు చేస్తోంది. తాజ్ ను సందర్శించేందుకు రోజూ వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వీరి వాహనాల పార్కింగ్ నిమిత్తం తాజ్ కు సమీపంలో సరైన సదుపాయాలు లేవు. ఉన్న పార్కింగ్ కూడా తాజ్ కు దూరంగా విసిరేసినట్టు ఎక్కడో ఉంటుంది. దీంతో ఆగ్రా అభివృద్ధి సంస్థ తాజ్ కు దగ్గర్లోనే పార్కింగ్ సౌకర్యం కల్పించేందుకు రంగం సిద్దం చేస్తోంది.

దీని కోసం స్థలాన్ని కూడా ట్రైడెంట్ హోటల్ దగ్గర్లో సిద్దం చేశారు. పార్కింగ్, గార్డెన్ కోసం పర్యాటకుల నుంచి సేకరించిన 20 లక్షల రూపాయలను ఖర్చు చేయనున్నట్టు ఆగ్రా డెవలప్ మెంట్ అసోసియేషన్ చైర్మన్ అజయ్ చౌహాన్ తెలిపారు. ఇప్పటికే పలువురు బిల్డర్లు తమ డిజైన్లతో ఆయనను కలిశారు. తాజ్ పర్యాటకులకు త్వరలో పార్కింగ్ కష్టాలు తీరడంతో పాటు, కంటికింపైన ఉద్యానవనం కూడా అందుబాటులోకి రానుంది.

  • Loading...

More Telugu News