: '35 కేజీల బంగారం' కేసులో కేబీ గోల్డ్ సంస్థపై ఐటీ దాడులు
నెల్లూరు పట్టణంలో కేబీ గోల్డ్ సంస్థపై ఆదాయ పన్ను శాఖాధికారులు దాడులు నిర్వహించారు. నిన్న చెన్నై-హౌరా ఎక్స్ ప్రెస్ లో కలకత్తా నుంచి అనధికారికంగా నెల్లూరు తరలిస్తున్న 35 కిలోల బంగారానికి సంబంధించిన బిల్లులు లేకపోవడంతో కేబీ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో పోలీసులు ఆదాయ పన్ను శాఖ అధికారులకు సమాచారం అందించడంతో, కేబీ గోల్డ్ సంస్థపై ఆదాయపన్ను శాఖాధికారులు ఈ రోజు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు.