: సత్తెనపల్లిలో పేలుడు
గుంటూరు జిల్లా సత్తెనపల్లి భావనారుషి నగర్ లో శుక్రవారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఎరువుల వ్యాపారి ప్రసాద్ ఇంటి ముందు భాగంలో కాలం చెల్లిన వంద పురుగుల మందు డబ్బాలున్నాయని, అవే విస్ఫోటనం చెంది ఉంటాయని అనుమానిస్తున్నారు. ప్రసాద్ ఇంటి ముందున్న గేటుదగ్గర ఈ పేలుడు చోటు చేసుకుంది. దీంతో ప్రసాద్ ఇంటితో పాటు సమీపంలోని ఆరు గృహాల తలుపులు, గోడలు బీటలు వారాయి. పేలుడు సమయంలో ప్రసాద్ తో పాటు ఆయన భార్య, మనుమడు కూడా ఉన్నారని, వారంతా సురక్షితంగానే ఉన్నారని పోలీసులు తెలిపారు. కాగా పేలుడుకు కారణం తెలుసుకునేందుకు పురుగు మందుల నమూనాలను రసాయన పరీక్షకు పంపారు.