: రెండు 'రాయల' జిల్లాలతో త్వరలో తెలంగాణ!


తెలంగాణపై తేల్చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. నాన్చడం కాకుండా సాధ్యమైనంత వేగంగా తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేసి, 2014 ఎన్నికల్లో గణనీయంగా లబ్ధి పొందాలని భావిస్తున్నట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. నిన్న ఢిలీలో సమావేశమైన కాంగ్రెస్ కోర్ కమిటీ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వాదనలను రెండు గంటలపాటు విని నిర్ణయాధికారాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి నివేదించిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికి కాంగ్రెస్ మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. రాయలసీమకు చెందిన కర్నూలు, అనంతపురం జిల్లాలను కూడా తెలంగాణలో కలపాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే రెండు రాష్ట్రాలలోనూ ఎంపీ సీట్ల బలం 21గా ఉంటుందని భావిస్తోంది. అయితే, తుదిగా వర్కింగ్ కమిటీలో సమగ్రంగా చర్చించాకే, అన్ని పరిణామాలను బేరీజు వేసుకుని తెలంగాణపై నిర్ణయాన్ని ప్రకటించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ తెలంగాణ ఇస్తే గూర్ఖాల్యాండ్ వంటి ఇతర సమస్యలను ఎలా ఎదుర్కొవాలో కూడా కాంగ్రెస్ ఆలోచిస్తోంది. అయితే, తెలంగాణ విషయంలో తప్ప, మరే ప్రత్యేక రాష్ట్రం విషయంలోనూ కాంగ్రెస్ హామీలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రకటించడానికే కాంగ్రెస్ సన్నాహాలు చేస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News