: ఒవైసీ సోదరులకు సర్కారు ఝలక్


మజ్లిస్ నేతలు ఒవైసీ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ఝలకిచ్చింది. కందికల్ గ్రామం వద్ద ఒవైసీ ఆసుపత్రిలో కలిసిన 2.57 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ భూమి తమదేనంటూ ఇంతకుముందు ఒవైసీ సోదరుల తరుపున.. మహ్మద్ షరీఫుద్దీన్, మరో ఆరుగురు వ్యక్తులు జిల్లా కలెక్టర్ నవీన్ మిట్టల్ కు కొన్ని పత్రాలు చూపించి నిరభ్యంతర పత్రం (ఎన్ వోసీ) తీసుకున్నారు. దీంతో, కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారంటూ ప్రజాసంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. అయితే, హైదరాబాద్ కలెక్టర్ గా నటరాజన్ గుల్జార్ రంగప్రవేశంతో కథ మారింది.

ఒవైసీలకు కేటాయించిన భూమి ప్రభుత్వానిదే అని, ఒవైసీ సోదరులకిచ్చిన ఎన్ వోసీ చెల్లదని భూ పరిపాలన శాఖ చీఫ్ కమిషనర్ కు లేఖ రాశారు. దీంతో, ఆ నిరభ్యంతర పత్రం రద్దయింది. కానీ, అప్పటికి కాంగ్రెస్ తో మెరుగైన సంబంధాలు కలిగివున్న మజ్లిస్ అధినేతలు స్టే తెచ్చుకున్నారు. అయితే, ఇటీవలే మజ్లిస్ కు కాంగ్రెస్ తో బెడిసికొట్టిన నేపథ్యంలో వారికి షాక్ తప్పలేదు. తాజాగా ప్రభుత్వం ఆ భూమిపై స్టేను వెనక్కితీసుకుంది.

  • Loading...

More Telugu News