: హస్తినలో బొత్సకు అవమానం
పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు హస్తినలో నేడు భంగపాటు ఎదురైంది. సోనియా అధికారిక నివాసం '10 జన్ పథ్' లో ఈ ఉదయం ఆహారభద్రత అంశంపై వివిధ రాష్ట్రాల సీఎంలతో సమావేశానికి బొత్సకు అనుమతి నిరాకరించారు. తనను మేడమ్ ఫోన్ చేసి పిలిచారని వివరించినా బొత్సను అక్కడి భద్రత సిబ్బంది సమావేశ మందిరంలోనికి వెళ్ళనివ్వలేదు. దీంతో ఖిన్నుడైన బొత్స.. కాసేపు అక్కడే ఉండి చేసేదేమీలేక తిరుగు పయనమయ్యారు.