: నవంబర్ లో డీఎస్సీ నోటిఫికేషన్ : పార్థసారథి
నవంబరులో 21 వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని ఉన్నత విద్యాశాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. కృష్ణా జిల్లా విజయవాడలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు నెలాఖరులో టెట్ పరీక్ష నిర్వహిస్తామన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే విజయవాడను ఆంధ్రా ప్రాంతానికి రాజధాని చేయాలని కోరారు. భద్రాచలం డివిజన్ ను ఆంధ్రాప్రాంతంలో కలిపి, హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని మంత్రి పార్థసారథి సూచించారు.