: తెలంగాణ కోసం పోరుకు సీపీఐ సై
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సీపీఐ పోరాటాన్ని తీవ్రతరం చేయనుంది. ఈ నెల 15 నుంచి ఇతర వామపక్షాలతో కలిసి ఉద్యమిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తిరుపతిలో తెలిపారు. తెలంగాణ సంక్షోభానికి కారణం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీయేనని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అందుకే తెలంగాణ జేఏసీకి తాము దూరంగా ఉంటున్నామని నారాయణ చెప్పారు.